నవజాత శిశు అంబులెన్స్ సేవలపై అవగాహన సదస్సు

887చూసినవారు
నవజాత శిశు అంబులెన్స్ సేవలపై అవగాహన సదస్సు
ఆంధ్రప్రదేశ్ లో శిశు మరణాల రేటును తగ్గించే చర్యలలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నవజాత శిశువుల కొరకు నూతనంగా ప్రవేశ పెట్టిన నియోనాటల్ 108 అంబులెన్స్ సేవలపై, శుక్రవారం సంతబొమ్మలి మండలం బోరుభద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పద్మావతి ఆధ్వర్యంలో ఆశ, ఏ యన్ యం లకు నియోనాటల్ 108 లో అత్యాధునిక వైద్య పరికరాలు అయిన వెంటిలేటర్, ఇంక్యూబెటర్ , మోనిటర్, సిరంజ్ అండ్ ఇన్ఫ్యూజన్ పంప్ ఉన్నాయని వాటి ప్రత్యేకతలు వివరించారు. అలాగే బోరుభద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు 108 సేవలపై అవగాహన కల్పిస్తూ, 108 లో ఉన్న అత్యాధునిక పరికరాలను చూపిస్తూ వాటి ఆవశ్యకతను వివరించారు.

అత్యవసర పరిస్థితులలో ప్రాధమిక చికిత్స అందిస్తూ.. చికిత్స నిమిత్తం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కే, కాకుండా పేషెంట్ సహాయకులు కోరిక మేరకు సమీప ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తారని ఈ యం టి దేవాది శ్రీనివాసరావు తెలియజేస్తూ, ఈ నియోనాటల్ 108 అంబులెన్స్ సేవలు ప్రజలు వినియోగించుకొనేలా ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పి హెచ్ సి పరిధిలో ఉన్న ఏ యన్ ఎం లు, ఆశ వర్కర్లు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, టెక్కలి నియెనాటల్ 108 సిబ్బంది దేవాది శ్రీనివాసరావు, జలుమూరు శశి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్