గ్రామీణ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కోసం ప్రజలకు అవగాహన కలిగించాలని బిజెపి పార్టీ బీసీ సంక్షేమ వసతి గృహాలు రాష్ట్ర కన్వీనర్ అట్టాడ రాజేష్ అన్నారు. ఆదివారం నందిగాం మండలం మణిగాం గ్రామంలో స్థానిక సర్పంచ్ మల్ల సీతారాం ఆధ్వర్యంలో వికసిత
భారత్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అనేక పథకాల కోసం వివరించారు.