మా శ్రీరామ కాలనీలో సమస్యలను టెక్కలి సబ్ కలెక్టర్ ఆఫీసు స్పందన లో ఫిర్యాదు చేసినా ఏ సిబ్బంది కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. రోజురోజుకు దోమలు పెరిగి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కాలనీలో మలేరియా ప్రబలి ఆసుపత్రి చుట్టూ కాలనీ వాసులు తిరుగుతూ ఉన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని టెక్కలి 8వ వార్డు శ్రీ రామా కాలనీ వాసుల వేడుకుంటున్నారు.