ప్రజల ప్రాణాలతో చెలగాటం

14343చూసినవారు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి పరిధిలోని అరటి పండ్లు దుకాణం యజమానులు అందరూ సిండికేట్ గా ఏర్పడి రాజమండ్రి, రావులపాలెం, ఏలూరు నుండి అరటి గెలలు దిగుమతి చేసుకుని పక్వానికి రాకముందే వాటిని కొనుగోలుదారులు ఎదుటనే కార్బైడ్ వేస్తున్నా అడిగే అధికార యంత్రాంగం లేదంటే విచారించదగిన విషయం. కార్బైడ్ తో మగ్గిన పండ్లు తింటే కిడ్నీ సమస్యలు, రక్త హీనత, కాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి అని తెలిసి ప్రజలు మార్కెట్లో దొరికే అటువంటి పండ్లు తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయో అర్థం కావటం లేదు. శాసన, న్యాయ, కార్యనిర్వహక వ్యవస్థ బలమైనది అని చెప్పుకొనే ఈ దేశంలో మనం జబ్బులు బారిన పడటం మన దౌర్భాగ్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్