ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా బుధవారం టెక్కలి మండల కేంద్రంలో పలు దళిత సంఘాల ప్రతినిధులు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా ఇందిరాగాంధీ కూడలి వరకు వచ్చి అక్కడ మానవహారం చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బోకర నారాయణరావు, చల్లా రామారావు, ఆట్ల రాహుల్ తదితరులు పాల్గొన్నారు.