కోటబొమ్మాలి మండల కేంద్రంలోని కోర్టులో బుధవారం మధ్యాహ్నం ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ బి. ప్రసన్న లత ఆధ్వర్యంలో పార్టీల మధ్య చర్చలు జరిపి ప్రీ లోకదాలత్ నిర్వహించారు. రెండు క్రిమినల్ కేసులు రాజీ చేశారు. కక్షిదారులు ఈ లోకదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందస్తు లోక్ అదాలత్ లు ప్రతిరోజూ జరుగుతాయన్నారు. సీనియర్ న్యాయవాదులు బి ధర్మారావు, బి. జీవన్ , కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.