వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు : డిప్యూటీ సీఎం పవన్

60చూసినవారు
వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు : డిప్యూటీ సీఎం పవన్
వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వన్యప్రాణాల సంరక్షణ కోసం అటవీ శాఖలోని యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. పవన్ మాట్లాడుతూ. “వన్యప్రాణులను వేటాడటం, అటవీ సంపదను నాశనం చేయడం నేరమని, వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 18004255909కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో అనంతరాము, చిరంజీవ్ చౌదరి, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్