ఒకవైపు ఎండలు.. మరోవైపు తేలికపాటి జల్లులు

80చూసినవారు
ఒకవైపు ఎండలు.. మరోవైపు తేలికపాటి జల్లులు
AP: రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఒక వైపు ఎండలు దంచికొడుతుండగా.. మరోవైపు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావం ఉన్నప్పటికీ వాతావరణం చల్లబడే పరిస్థితి లేదని పేర్కొంది. 3 రోజుల పాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్