డబుల్ ఎలివేటెడ్ కారిడార్లపై మెట్రో అధికారులు అయిష్టత వ్యక్తం చేశారు. డబుల్ ఎలివేటెడ్, ప్రత్యామ్నాయ మార్గాలపై బేగంపేటలోని మెట్రోరైలు భవన్‌లో జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైలు అధికారులు చర్చించారు. డబుల్ ఎలివేటెడ్ కారిడార్లలో మొదటి అంతస్తులో రహదారి, రెండో అంతస్తులో మెట్రో ట్రాక్‌లు ఉండడంతో స్టేషన్ల ఎత్తు 65 అడుగుల వరకు వెళుతుందని తెలిపారు. దీంతో నిర్వహణపరంగా సమస్యలు తలెత్తుతాయని అభ్యంతరం చెప్పారు.