AP: బెనిఫిట్ షోలపై టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి తీవ్రస్థాయిలో స్పందించారు. బెనిఫిట్ షోలు ఎవరి కోసమో చిత్ర పరిశ్రమ వర్గాలు చెప్పాలని నిలదీశారు. 'సినిమా వాళ్లను, నిర్మాతల మండలిని నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరి బెనిఫిట్ కోసం మీరు బెనిఫిట్ షోలు వేస్తున్నారు? మీ లాభాల కోసం ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలా? బెనిఫిట్ షోలను ఆపేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను' అని ఆయన స్పష్టం చేశారు.