విజయనగరంలో ఉద్రిక్తత

83చూసినవారు
విజయనగరంలో ఉద్రిక్తత
విజయనగరం జిల్లా రాజాంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాజు కారు వద్ద ఇద్దరు మైనర్లు నిలబడి ఉన్నారు. కారులో వస్తువులు దొంగలిస్తున్నారని రాజు అనుచరులు మైనర్లను చితకబాదారు. మైనర్లకు తీవ్ర గాయాలు కాగా.. రాజాం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మైనర్ల బంధువులు రాజు ఆఫీస్ వద్దకు చేరుకుని కార్యాలయాన్ని ముట్టడించారు. దాంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

సంబంధిత పోస్ట్