రఫాపై ఇజ్రాయెల్‌ ముమ్మర దాడులు

80చూసినవారు
రఫాపై ఇజ్రాయెల్‌ ముమ్మర దాడులు
దక్షిణ గాజాలోని రఫాపై ఇజ్రాయెల్‌ మరోసారి తుపాకులతో విరుచుకుపడింది. గాజాలో ఇజ్రాయెల్‌ నరమేధానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ దక్షిణాఫ్రికా వేసిన పిటిషన్‌పై శుక్రవారం 15 మంది న్యాయమూర్తుల ఐసీజే ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సైనిక చర్యను వెంటనే ఆపేయాలని ఐసీజే ఆదేశించింది. అయితే వీటిని బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడడం గమనార్హం.

ట్యాగ్స్ :