AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ స్టార్ క్యాంపెయినర్‌గా మారారని వైసీపీ ట్వీట్ చేసింది. తమ అధినేత జగన్ హయాంలో చేసిన అభివృద్ధి గురించి పవన్ ప్రచారం చేస్తున్నందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పింది. స్కూళ్లు, కర్నూలులో గ్రీన్‌కో సోలార్ ప్రాజెక్టు, పంప్ స్టోరేజ్, విశాఖలో రుషికొండ భవనాల వద్ద పవన్ దిగిన ఫోటోలను ట్విట్టర్‌లో వైసీపీ షేర్ చేసింది.