కశ్మీర్‌లో నేడు జెడ్‌మోర్ టన్నెల్‌ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి, మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. కాగా శ్రీనగర్ – లేహ్ జాతీయ రహదారిపై రూ. 2,400 కోట్లతో జెడ్‌మోర్ టన్నెల్ నిర్మించారు. ఈ టెన్నెల ద్వారా ఏ సీజన్‌లోనైనా గమ్యస్థానాలకు ఆటంకం లేకుండా చేరుకోవచ్చు.