AP: వాహనదారులకు విధించే జరిమానాలపై బుధవారం శాసన మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. హెల్మెట్లు లేనివారి నుంచి రూ.1000 జరిమానా వసూలు చేయడం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని టీడీపీ సభ్యులు తెలిపారు. దీనిపై హోంమంత్రి అనిత సమాధానమిస్తూ.. 2020లో కేంద్రం చేసిన చట్టం, సుప్రీం ఆదేశాల ప్రకారమే రాష్ట్రంలో జరిమానా వసూలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అనిత స్పష్టం చేశారు.