AP: కేంద్ర ప్రభుత్వం విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల సీఎంసీ కోసం తాజాగా నిధులు మంజూరు చేసింది. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ ప్లాన్ గడువు ఐదేళ్లు దాటడంతో.. మరోసారి ప్లాన్ రూపొందించాలని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్‌పోర్టు విభాగం కూటమి ప్రభుత్వాన్ని కోరింది. అయితే కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు సీఎంసీ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్ల ద్వారా ఎంపిక చేసింది.