అమరావతికి కేంద్రం తీపికబురు

54చూసినవారు
అమరావతికి కేంద్రం తీపికబురు
అమరావతికి కేంద్రం తీపికబురు చెప్పింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరుకు 56.53 కి.మీ. రైల్వే లైన్ కోసం భూసేకరణకు రైల్వే శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త లైన్‌లో పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరులో 9 స్టేషన్లు నిర్మిస్తారు. వీటికి అమరావతి ప్రధాన స్టేషన్‌గా ఉండనుంది. కొత్తపేట-వడ్డమాను మధ్య కృష్ణానదిపై 3 కి.మీ. వంతెన నిర్మిస్తారు. ఇందు కోసం రూ.2,600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

సంబంధిత పోస్ట్