AP: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం కాస్తా రాబోయే 48 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో సాధారణ స్థాయి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.