సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో కేసుల పర్వం కొనసాగుతోంది. వైసీపీ నాయకులు, సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా పాడేరు పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదైంది. ఇప్పటికే పోసానిపై ఏపీ వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ఉచ్చు బిగుస్తోంది. పోసానిని అరెస్ట్ చేయాలంటూ పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒక్కరోజే పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 22 కేసులు నమోదు కావడం గమనార్హం.