ఏపీలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మారినా ఇసుక అక్రమాలు ఆగడం లేదు. తాజాగా ఇసుక అక్రమ తవ్వకాలను పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు కేంద్రంగా మారింది. అన్నిండ్లపాడు గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపులో ఇసుక తీసుకెళ్తున్న భారీ లారీలను రైతులు అడ్డుకున్నారు. లారీలపై కేశినేని అంటూ లారీ వెనుక స్టిక్కర్లతో టిప్పర్లు కనిపించాయి.