AP: గుంటూరు జిల్లా నరసరావుపేటలోని వరవకట్ట ప్రాంతం గంజాయి విక్రయాలకు అడ్డాగా మారింది. కేటుగాళ్లు మద్యం, గంజాయి ఇచ్చి మైనర్లచేత చోరీలకు పాల్పడుతున్నారు. వరవకట్ట ప్రాంతం మరో పాతబస్తీ అయ్యే ప్రమాదం ఉందని నరసరావుపేటవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.