AP: విజయనగరం జిల్లా కొండపావులూరులో కేంద్ర మంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ NDRF, NIDM కార్యాలయాలను ప్రారంభించారు. ఎన్ఐడీఎం కార్యాలయం ఎదుట అమిత్ షా మొక్క నాటారు. తిరుపతిలో వర్చువల్‌గా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను అమిత్ షా ప్రారంభించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.