AP: కూటమి ప్రభుత్వంపై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి విడదల రజిని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్టై నరసరావుపేట సబ్ జైలులో ఉన్న వైసీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డి, సుధారెడ్డి దంపతులను ఆమె నేడు పరామర్శించారు. కేసులు పెట్టారని భయపడేది లేదు.. ధైర్యంగా ఎదుర్కొంటాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణే లేదు' అని రజిని అన్నారు.