లగచర్ల ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేసిన ఈటల

80చూసినవారు
లగచర్ల ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేసిన ఈటల
తెలంగాణలోని లగచర్ల ఘటనపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. రైతులను పోలీసు కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారని అందులో పేర్కొన్నారు. ఇప్పటికీ పోలీసులు, అధికార పార్టీ నాయకులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. వెంటనే ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందాలను లగచర్లకు పంపించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్