AP: వైసీపీ వల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తాజాగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఏపీకి ఉండే పెద్ద అవకాశం సముద్ర తీరం అన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అమరావతి, పోలవరం ఏపీకి రెండు కళ్లు అన్నారు. పోలవరం నిర్మాణ వ్యయం రూ.55కోట్లకు చేరింది. గత ప్రభుత్వం కేవలం 3.08 శాతం పనులను మాత్రమే చేసింది. కక్ష పూరిత రాజకీయాలతో పోలవరం ప్రాజెక్టును ఆపేశారన్నారు.