TDPకి వచ్చే సీట్లు ఇవే.. చంద్రబాబు అంచనా

85చూసినవారు
TDPకి వచ్చే సీట్లు ఇవే.. చంద్రబాబు అంచనా
టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? అనే విషయాన్ని అంచనా వేసినట్లు తెలుస్తోంది. పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలిస్తే వైసీపీకి కనీసం 35 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని.. కూటమికి 120 సీట్ల పైనే వస్తాయని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. టీడీపీకి జనసేనాని పవన్ కళ్యాణ్ మాటకు కట్టుబడి సహకారం అందించారని.. దాదాపుగా మెజారిటీ సీట్లలో జనసేన గెలవబోతోందని పార్టీ నాయకులతో చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది.