గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్

60చూసినవారు
గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్
హమాస్‌తో యుద్ధంలో భాగంగా రఫాపై బాంబులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఈజిప్ట్‌తో గాజా సరిహద్దు వెంబడి నడుస్తున్న వ్యూహాత్మక కారిడార్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు కారిడార్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఫిలడెల్ఫియా అని పిలువబడే ఈ కారిడార్ ఈజిప్టు సరిహద్దులోని దక్షిణ గాజా నగరమైన రఫా సమీపంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలోని సేఫ్ జోన్ నుంచి ఇజ్రాయెల్ రఫాపై దాడి చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్