AP: తిరుమల జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన రద్దు అయింది. గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ పరిశీలించాల్సి ఉంది. అలాగే అనివార్య కారణాల వల్ల మంత్రి నారా లోకేశ్ కర్నూలు పర్యటన కూడా రద్దైనట్లు అధికారులు తెలిపారు. లోకేశ్ ఇవాళ కర్నూలులో పలు కళాశాలల సందర్శనతోపాటు మంత్రి భరత్ కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది.