చంద్రగిరిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

80చూసినవారు
చంద్రగిరిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
చంద్రగిరి మండలం పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిలో నాగాలమ్మ మలుపు వద్ద పెట్రోల్ బంకు ప్రహరీ పక్కన గుర్తుతెలియని (55) వ్యక్తి శవాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని ఒంటిపైన తెల్లటి బనియన్, నిలువు గీతల చొక్కా, లుంగీ ఉంది. ఇతరత్రా ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని ఎస్వీ వైద్య కళాశాలకు తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్