రూ. 5 లక్షల వైఎస్సార్ భీమా నగదు అందజేసిన తుడా ఛైర్మెన్

58చూసినవారు
రూ. 5 లక్షల వైఎస్సార్ భీమా నగదు అందజేసిన తుడా ఛైర్మెన్
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగన్నాథరెడ్డి కుటుంబానికి వైఎస్సార్ భీమా ఆర్థిక భరోసా కల్పించింది. శనివారం శానంభట్లలోని జగన్నాథరెడ్డి నివాసం వద్దకు వెళ్లిన తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కుటుంబ సభ్యులకు రూ. 5లక్షలు వైఎస్సార్ భీమా నిధులు అందజేశారు. సంపాదించే కుమారుణ్ణి కోల్పోయామని కంటతడి పెట్టుకున్న కుటుంబ సభ్యులను మోహిత్ రెడ్డి ఓదార్చారు. ఏ అవసరం వచ్చినా మేమంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్