తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సందర్భంగా చెన్నైకి చెందిన వీర్ వసంత్ కుమార్ గురువారం ఆరు గొడుగులను టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరిలకి అందజేశారు. వీటిని అమ్మవారి వాహన సేవల సమయంలో వినియోగించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్వో శ్రీధర్, జేఈవో వీరబ్రహ్మం, ఉద్యానవన శాఖ డిడి శ్రీనివాసులు పాల్గొన్నారు.