తిరుచానూరు: చిన్నశేష వాహనంపై శ్రీప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

57చూసినవారు
తిరుచానూరు శ్రీప‌ద్మావ‌తి అమ్మ‌వారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజైన గురువారం రాత్రి శ్రీపద్మావతి అమ్మవారు మురళి కృష్ణుడి అలంకారంలో పిల్లనగ్రోవి ధరించి చిన్న‌శేష‌వాహ‌నంపై అభ‌య‌మిచ్చారు. మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. అమ్మవారి ద‌ర్శ‌నం వ‌ల్ల యోగసిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్