రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారీగా మోపుతున్న విద్యుత్ చార్జీలను వెంటనే రద్దు చేయాలని విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో దగ్ధం చేసే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపునిచ్చారు. ఆదివారం చిత్తూరులో సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అదనపు విద్యుత్ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.