సరైన వర్షపాతం లేని కారణంగా పంటలు నీటి ఎద్దడికి గురవుతున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ శుక్రవారం తెలిపారు. పంట నష్ట నివారణకు జిల్లా రైతాంగం వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని కోరారు. రెండు శాతం యూరియా ద్రావణం, 10రోజుల వ్యవధిలో 19-19-19 ఎరువును రెండుసార్లు పిచికారీ చేయాలని సూచించారు. స్పింకర్ల ద్వారా నీరు పిచికారీ చేయాలన్నారు.