కారుకు నిప్పు పెట్టిన యువకులు

15372చూసినవారు
గుడిపల్లి మండలం మర్రిమానుకొత్తూరు వద్ద గుర్తు తెలియని యువకులు రోడ్డుపై కారును పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. బైక్ ను కారు ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా, ప్రమాదం జరిగిన సందర్భంగా ఏర్పడిన ఘర్షణలో కారును ధ్వంసం చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని సమాచారం. ఘటనపై గుడిపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్