ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా మంగళవారం పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం తో పాటు నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బుధవారం చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవాన్ని ప్రభుత్వ కార్యాలయల్లో ఎల్ ఈ డీ టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.