నెల్లూరు నగరంలోని దుర్గామిట్టలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి గడ్డం రత్నయ్య చౌదరి దంపతులు సోమవారం మైక్ సెట్ ను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గ సభ్యులు, టిడిపి నేతలు వారికి మంగళ వాయిద్యాలతో ఆలయ అంచనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్, దొరబాబు, తోట శోభారాణి, నరేష్, నాగమణి, పద్మజ, నీళ్ళ పెంచలమ్మ పలువురు నేతలు పాల్గొన్నారు.