కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రశ్నిస్తే వారిని అక్రమ కేసులతో వేధింపులకు గురిచేయడం దారుణమని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. పూతలపట్టు వైసీపీ మండల కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డిని మిథున్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. కక్ష్య పూరిత రాజకీయాలకు టీడీపీ స్వస్తి పలకాలని, సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పేరుతో వేధింపులు మానుకోవాలని మిథున్ రెడ్డి సూచించారు.