వినాయక స్వామిని దర్శించుకున్న బాంబే హైకోర్టు న్యాయమూర్తి
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని బాంబే హైకోర్టు న్యాయమూర్తి మాంగేష్ ఎస్. పాటిల్ కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఆలయ ఏఈఓ రవీంద్రబాబు వారికి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, సూపరింటెండెంట్ వాసు పాల్గొన్నారు.