ఈ నెల 26వ తేదీ ఆరిమాకులపల్లి చెందిన మమత బైక్ పై బంగారుపాళెం భారత్ పెట్రోల్ బంక్ వద్ద వెళ్తూ ఉండగా కిందపడి తలకు తీవ్ర గాయామైంది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వేలూరు సీఎంసీ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మరణించింది. ఆమె మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.