నాగలాపురం మండలంలో వేకువ జామున వర్షం

70చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో పలు గ్రామాలలో బుధవారం వేకువ జామున ఓ మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమై కనిపించింది. రాత్రి నుంచి ఉదయం వరకు విడతల వారీగా వర్షం కురిసింది. గ్రామాలలో చలి వాతావరణం నెలకొంది. వేరుశనగ విత్తనం సాగు చేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని, వద్దాలు ఆగిన తర్వాత వేరుశనగ విత్తనాలు విత్తుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్