శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో కాలభైరవ స్వామికి మంగళవారం విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, చందనము, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా నిమ్మకాయ మాలతో అలంకరించి ఆపై అర్చకులు పుష్పాలతో పూజలు చేసి కర్పూర హారతి సమర్పించారు. విశేషంగా భక్తులు కాలభైరవ స్వామి అభిషేకంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి పాల్గొన్నారు.