బాలయపల్లి పరిధిలోని నాయుడుపేటలోని స్వర్ణముఖి నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం నీళ్లల్లో కొట్టుకొచ్చినట్లు స్థానికులు తెలిపారు. తెలుగుగంగా కాలువ నుంచి స్వర్ణముఖి నదికి నీరు వదలడంతో నీటిలో కొట్టుకొస్తున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీహరిబాబు, హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజు నది వద్దకు చేరుకుని, పరిశీలిస్తున్నారు.