రాపూరు: అంకమ్మను దర్శించుకున్న వైసీపీ నాయకులు
రాపూరు మండలంలోని పోతుకొండ అంకమ్మ తల్లిని వైసీపీ జనరల్ సెక్రటరీ పాప కన్ను మధుసూదన్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు బొడ్డు మధుసూదన్ రెడ్డి, దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి, ఏటూరు విజయ్ శేఖర్ రెడ్డి, మల్లిరెడ్డి సంజీవరెడ్డి, పిల్లి వెంకటేశ్వర్లు, పింగణి నారాయణరెడ్డి, పోలయ్య పాల్గొన్నారు.