ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలు ఎమ్మెల్యే అందజేత

58చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలు ఎమ్మెల్యే అందజేత
కలువాయి మండలం బ్రాహ్మణపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం స్థానిక టిడిపి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. శనివారం ఈ కార్యక్రమంలో భాగంగా అంగనవాడి ఆధ్వర్యంలో గర్భవతులకు శ్రీమంతం చేసి పౌష్టికాహార వసతులను వారికి ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లి కూటమి ప్రభుత్వంలో 100 రోజుల్లో జరిగిన అభివృద్ధి పనుల కరపత్రాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్