విశాఖ జిల్లా భీమిలి మండలంలో విషాదం చోటు చేసుకుంది. మజ్జివలస గ్రామానికి చెందిన బంటుపల్లి సురేష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆద్య(3) రెడ్డిపల్లిలోని పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. ఎప్పటిలాగే స్కూల్‌కు వెళ్లి వచ్చిన ఆద్య బస్సు దిగింది. ఆద్య కోసం తండ్రి సురేష్ అవతలి రోడ్డులో వేచి చూస్తున్నాడు. బాలిక బస్సు దిగి రోడ్డు దాటిందనుకుని డ్రైవర్ బస్సును నడిపాడు. ఆద్యను బస్సు ఢీకొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తండ్రి చేతుల్లో నాన్నా.. నాన్నా.. అంటూ కన్నుమూసింది.