AP: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల అడవుల్లో యురేనియం తవ్వకాలను గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. 12 గ్రామాల ప్రజలు ఏకమై శనివారం ఆందోళనకు దిగారు. సేవ్ కప్పట్రాళ్ల అంటూ నినదిస్తున్నారు. వీరికి మద్దతు తెలిపేందుకు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష వెళ్తేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.