శాస్త్రవేత్తల ప్రకారం జీవరాశుల ఉనికి కోసం జీవితానికి అవసరమైన కొన్ని విషయాలు శని, బృహస్పతిపై ఉన్నాయి. వీటిలో మొదటిది శక్తి, రెండవది కార్బన్ వంటి సేంద్రీయ భాగాలు, మూడవది నీరు. ఇవి ఉన్నప్పుడే జీవరాశికి ఆస్కారం. బృహస్పతి, శని గ్రహాలపై నీరు ఉంటుంది. అయితే అది మంచు రూపంలో ఉంది. అదేవిధంగా శని గ్రహం మంచు వలయాలతో పాటు జీవితానికి అవసరమైన సూర్యరశ్మి, కార్బన్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది.