కేరళ వయనాడ్ బాధితుల కోసం వీర బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ళ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బొబ్బిలి పరిసర ప్రాంతాల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బొబ్బిలి నియోజకవర్గం శాసనసభ్యులు ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) తమ వంతు సహాయంగా 20వేల రూపాయల చెక్కును కమిషనర్ ఎల్ రామలక్ష్మి సమక్షంలో విరాళంగా అధ్యక్షులు కిరణ్ కుమార్ కు అందించారు.