బొబ్బిలి: డ్వాక్రా మహిళా పొదుపు సంఘాల సోషల్ ఆడిట్
బొబ్బిలి మండలం ముత్తావలస గ్రామంలో డ్వాక్రా మహిళా పొదుపు సంఘాల సోషల్ ఆడిట్ బుధవారం ఏపీఎం, సర్పంచ్ సుధా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న కొన్ని మహిళా సంఘాలలో కొన్ని సమస్యలు ఉన్నట్టు తమ దృష్టికి వచ్చేయని తెలిపారు. అలాగే గ్రామంలో ఉన్న అన్ని సంఘాలను నిష్పక్షపాతంగా ఆడిట్ చేసి రిపోర్ట్ అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, సీసీ, ఉద్యోగులు పాల్గొన్నారు.